సత్య తిరస్కారి సైతం తిరస్కరించలేని వాస్తవ విషయం మరణం. మనిషి పుట్టినప్పటి నుండే సమాధి వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. సృష్టి కర్త తప్ప సృష్టి రాశులన్నీ నాశనమవక తప్పదు. మానవుడు కూడా సృష్టించబడిన వాడే కాని అతని వ్యవహారం కొంత వేరుగా ఉంటుంది. అతడు కూడా మరణిస్తాడు కాని మళ్ళీ పుట్టించబడతాడు. ఎందుకంటే మానవునికి మాత్రమే బుద్ధి జ్ఞానాలు ప్రసాదిత మయ్యాయి. తనకు తోచినట్లు చేసే, ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇచ్చి భూమిపై పంపడం జరిగింది, తద్వారా అతని పరీక్షించాలని. కావున అతన్ని మళ్లీ పుట్టించి తన కర్మల లెక్క తీసుకోవడం జరుగుతుంది. ఒక వేళ ఈ రిపోర్ట్ సంతృప్తి కరంగా ఉంటే, అనగా పరీక్షలో ఉత్తీర్ణుడైతే తత్ఫలితంగా శాశ్వతంగా ఉండే స్వర్గం లో ప్రవేశం పొందుతాడు. అక్కడ నుండి అతన్ని తీసేయడం జరగదు. అతను కూడా అక్కడి నుండి బయటకు రావాలనుకోడు. ఒకవేళ రిపోర్ట్ అసంతృప్తి కరంగా ఉంటే, అనగా పరీక్ష లో నెగ్గనట్టయితే తత్ ఫలితంగా శాశ్వతంగా నరకం లో పడవేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అతడు పారిపోవాలని అనుకున్నా పారిపోలేడు. ఎందుకంటే అక్కడ బలమైన దైవ దూతలు నియమితులయి ఉంటారు.

మానవులందరి సృష్టి కర్త అల్లాహ్ యే అని, మరణం తరువాత మళ్ళీ పుట్టించబడటం అనివార్యమని, ఇహలోకం లో చేసిన పనులకు ప్రతి ఫలం లభిస్తుందని మంచి పనులకు ఫలితం స్వర్గమని, చెడు పనులకు ఫలితంగా నరకమని మనిషి నైజం లోనే పెట్టడం జరిగింది. ఇంకా ప్రవక్తలను పంపి తెలియజేయడమూ జరిగింది. ఎవరైతే ప్రవక్తలు చెప్పిన విధంగా మంచి పనులు చేసారో వారు స్వర్గాన్ని తమ కళ్ళారా చూసి తమ సత్ఫలితంపై సంతోషాన్ని వ్యక్త పరుస్తూ కృతజ్ఞతలు తెలుపుతుంటారు. మరెవరైతే తిరస్కరించారో తమ కళ్ళల్లో నరకాన్ని చూస్తూ పశ్చాత్తాప పడుతూ ఉంటారు. బాధపడుతూ ఉంటారు. ఇంకా మంచి పనులు చేసేందుకు భూమి పైకి పంపించ మని పిర్యాదు చేస్తుంటారు. కాని వారి ఈ కోరిక ఎప్పటికీ నెరవేరదు. ఎందుకంటే ఏ ప్రపంచం అయితే అతన్ని ఎమరుపాటుకు గురిచేసిందో ఆ ప్రపంచమూ ఉండదు. దాని హంగు పొంగులూ ఉండవు.

ఉర్దూ మూలం: ముహమ్మద్‌ అజీజుద్దీన్ ఖాలిద్.
తెలుగు అనువాదం: ముహమ్మద్ ముష్తాక్.

Disclaimer: The views expressed in this blog post are those of the authors and do not necessarily reflect the views of Jamaat-e-Islami Hind Telangana